Home  »  TV News  »  స్వప్న ఆచూకి తెలిసిపోయిందని చెప్పిన రాజ్.. కనకంకి టెన్షన్!

Updated : Apr 5, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -61లో.. కావ్య గదిలో నుండి రాజ్ మెల్లిగా బయటకొచ్చి తలుపు వేస్తుండగా కళ్యాణ్ వస్తాడు. అయ్యో.. ఎవడైతే చూడొద్దనుకున్నానో వాడే చూసాడని కళ్యాణ్ ని చూసి రాజ్ తన మనసులో అనుకుంటాడు. అన్నయ్య నువ్వేంటి ఇక్కడ అని అడుగగా..‌ ఇక్కడ ఏం జరుగలేదు. నువ్వేదో అర్థం చేసుకొని‌ ఇంట్లో వాళ్ళకి ఇంకేదో చెప్పకు అని రాజ్ చెప్పేసి వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం రాజ్ కి ఎస్ఐ కాల్ చేసి స్వప్న ఎక్కడుందో ఆచూకీ తెలిసిందని చెప్పడంతో నేను కూడా వస్తానని రాజ్ అంటాడు. ఆ తర్వాత రాజ్ తన గది నుండి హాల్లోకి వచ్చి కావ్య అని గట్టిగా అరిచేసరికి అందరూ ఏం అయిందని అడిగినా రాజ్ సమధానం చెప్పడు. కావ్య రాగానే.. ఆ రోజు రాత్రి ఎక్కడికి వెళ్ళావ్? అని అడుగగా.. పోలీస్ స్టేషన్ కి వెళ్ళానని కావ్య చెప్తుంది. పెళ్ళిల్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళ అక్క కనపడట్లేదని కంప్లెంట్ ఇవ్వడానికి వెళ్ళిందని రాజ్ చెప్పేసరికి అందరూ షాక్ అవుతారు. దుగ్గిరాల ఇంట్లోని ఆడవాళ్ళు బయటకు వెళ్ళడమే తప్పు పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం మరో తప్పు అని రాజ్ నానమ్మ అంటుంది. ఇప్పటివరకు నువ్వు తెలివైనదానివని, లక్షణమైనదానివని చెప్పిన అత్తయ్య మామయ్యలే నువ్వు చేసింది తప్పని అన్నారు. మళ్ళీ మీ అక్క కోసం వెళ్ళడమేంటని అపర్ణ అడుగుతుంది. క్షమించండని కావ్య అంటుంది. "నేనే ప్రశ్నార్థకంగా మారాను ఈ ఇంట్లో.. ఎవరిని సాయం అడగాలో తెలియలేదు. కాని షరతులను ఉల్లంఘించలేదు. మా అక్క కనిపించలేదనే కంప్లెంట్ ఇచ్చాను. కానీ నా వాళ్ళతో నేను ఎప్పుడూ మాట్లాడలేదు" అని కావ్య చెప్తుండగా..‌ చాలు ఆపని రాజ్ అంటాడు. నువ్వు ఈ ఇంటికి ద్రోహం చేసావ్. మీ అక్క లేచిపోయిందని రాజ్ అనగా.. చాలు ఆపండి. మా అక్కని ఎవరో ట్రాప్ చేసారు‌. తను ఎక్కడుందో తెలిస్తే నిజాలన్నీ బయటకొస్తాయని కావ్య అనగా.. అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావని రాజ్ చెప్పేసి.. స్వప్నని తీసుకురావడానికి ఒక్కడే వెళ్తాడు.

ఆ తర్వాత కనకంకి కళ్యాణ్ కాల్ చేసి జరిగిందంతా చెప్తాడు. రాజ్ అన్నయ్య కన్నా ముందు మీరు ఆ హోటల్ కి వెళ్ళి స్వప్నని తీసుకెళ్ళండని కనకంకి కళ్యాణ్ చెప్పగా, సరేనని కనకం వాళ్ళ అక్కకి కాల్ చేసి హెల్ప్ చేయమని అడుగుతుంది. ఆ తర్వాత కనకం వాళ్ళ అక్క, కనకం బయల్దేరి స్వప్న ఉన్న హోటల్ దగ్గరికి వస్తారు. అప్పుడే హోటల్ దగ్గర ఎస్ఐ, రాజ్  కలిసి ఉండటం గమనించిన కనకం, వాళ్ళ అక్క భయపడతారు. మరోవైపు స్వప్న కోసం ఫుడ్ తీసుకొస్తున్న రాహుల్ హోటల్ బయట ఉన్న ఎస్ఐ, రాజ్ లని చూసేస్తాడు. ఆ విషయం స్వప్నకి కాల్ చేసి చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.